![]() |
![]() |

ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సాంగ్ తో ముమైత్ ఖాన్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలూగించింది ఈ అమ్మడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆమె హవా తగ్గిపోయింది. దాంతో అప్పుడప్పుడు బుల్లితెర మీద కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. కొంత కాలం క్రితం ప్రసారమైన ఓంకార్ డాన్స్ షో "డాన్స్ ఐకాన్ సీజన్ 2 తో ఒక మెంటార్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. రకరకాల వీడియోస్ ని రీల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది. అలాగే ఒక రూమి కవితను కూడా పెట్టింది. "ఒంటరిగా ఉన్నానని ఫీలవకు, విశ్వమంతా నీలోనే ఉంది. నిన్ను నువ్వు చిన్నతనంగా చూసుకోవడం మానెయ్. ప్రేమ పారవశ్యంతో కదులుతున్న విశ్వం నువ్వే.
నీ జీవితాన్ని నువ్వే వెలిగించుకో" అంటూ రూమి మనిషి జీవితం గురించి చెప్పిన ఒక కోట్ ని పోస్ట్ చేసింది. అలాగే తన రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని అందులో చిన్న చందమామను చూపిస్తూ మురిపెంగా నవ్వుతూ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే ముమైత్ గోరింటాకు గురించి కామెంట్స్ చేస్తున్నారు. "ముమైత్ నువ్వు మెహందీ ఆర్ట్ ఫీజుని సేవ్ చేసావ్. మెహందీ ఇలా కూడా పెట్టొచ్చా..చాలా బాగుంది. మీ మంచి మనసుకు ఫ్యూచర్ లో మీకు మంచి భర్త వస్తాడు. మీరు చాలా మంచి డాన్సర్." అంటూ కామెంట్స్ పెట్టారు.
![]() |
![]() |